ఇప్పటికే రూ.500 కోట్లు దోచుకున్నారు: వైసీపీ నేతలపై మండిపడ్డ కళా వెంకట్రావు

  • ఇళ్ల స్థలాల పేరుతో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ చేస్తున్నారు
  • ఇళ్ల స్థలాల పథకం వైసీపీ నేతలకు ఆర్థిక ఫలాల పథకంగా మారింది
  • ఏపీలో బలహీన వర్గాలకు చెందిన వారిని బెదిరిస్తున్నారు
  • వారి నుంచి భూములు లాక్కుంటున్నారు
ఆంధ్రప్రదేశ్‌లో ఇళ్ల స్థలాల పేరుతో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ చేస్తున్నారని టీడీపీ నేత కళా వెంకట్రావు అన్నారు. ఈ రోజు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇళ్ల స్థలాల పథకం వైసీపీ నేతలకు ఆర్థిక ఫలాల పథకంగా మారిందన్నారు.

ఏపీలో బలహీన వర్గాలకు చెందిన వారిని బెదిరించి, వారి నుంచి భూములు లాక్కుంటున్నారని కళా వెంకట్రావు ఆరోపించారు. రూ.లక్షల విలువచేసే భూములను కోట్ల రూపాయల విలువ చేసే భూములుగా చూపించి వైసీపీ నేతలు దోచుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన చెప్పారు.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో రూ.500 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు చేశారు. ప్రతి నియోజక వర్గంలో వైసీపీ నేతలు రూ.10 కోట్ల చొప్పున దోచుకున్నారని ఆయన అన్నారు.

kala venkatrao
Telugudesam
Andhra Pradesh

More Telugu News